ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఏకశిలా గర్ల్స్ క్యాంపస్‌కి చెందిన యువతి హాస్టల్‌లో గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు
ఈ మధ్య కాలంలో ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అప్పుులు, అనుకున్న పనులు కాలేదని, ఉద్యోగం రాలేదని, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా యువతే ఉంటున్నారు
హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని..
ఇదిలా ఉండగా తాజాగా వరంగలోనూ ఇలాంటే ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. వరంగంలో జిల్లాలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
హాస్టల్ గదిలో యువతి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా మార్చురీకి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు హాస్టల్ యాజమాన్యాన్ని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
దీంతో అనారోగ్య సమస్య వల్ల ఆ యువతి మరణించిందని తెలిపారు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అనారోగ్యంతో ఎందుకు తన కూతరు ఉరి వేసుకుందని? ఆ విషయం ఎందుకు కుటుంబ సభ్యులకు తెలియజేయలేదంటే? ఇంకా వేరే ఇతర కారణం ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో ఆ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025