నెల్లూరు : నెల్లూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థి సుధీప్ (15) ఉరేసుకుని బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. స్కూలు టీచర్ బ్యాగ్ నుంచి డబ్బులు తీశారన్న కారణంతో అందరి ముందు విద్యార్థిని కొట్టడంతో మానసిక ఒత్తిడికి గురై తన ఇంటిలోనే ఉరేసుకుని చనిపోయారు. తమ పిల్లవాడు డబ్బులు తీయలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ స్కూలు ఎదుట సుధీప్ భౌతికకాయంతో మృతుని తల్లిదండ్రులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర డిమాండ్ చేశారు. విద్యార్థిపై దాడి చేసి నిందలు మోపడం వల్ల మానసిక ఒత్తిడికి గురై మరణించారని పేర్కొన్నారు. పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also read
- April 2026 Horoscope: ఏప్రిల్ మాసంలో ఆర్థికంగా వారికి జాక్పాట్.. మీ రాశికి ఎలా ఉందంటే..?
- రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
- నగరంలో నయా దళారులు.. సాఫ్ట్వేర్, రైల్వే ఉద్యోగుల మత్తు దందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
- విద్యార్థినిపై అత్యాచారం కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు వీళ్లు గురువులేనా?
- పిల్లలిద్దరూ లండన్లో వెల్ సెటిల్డ్.. అయినా ఎందుకు ఆంటీ ఈ పనులు





