వార ఫలాలు (జూన్ 22-28, 2025): మేష రాశి వారు ఈ వారం ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దశ తిరుగుతుంది. ఊహించని శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మే రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో కేతువులో కలిసి ఉన్నందువల్ల ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దశ తిరుగుతుంది. ఊహించని శుభ వార్తలు వినే అవకాశం ఉంది. సొంత పనులు మీద శ్రద్ధ పెడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేయగలుగుతారు. కొందరు బంధుమిత్రుల వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోకపోవడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు ప్రస్తుతం వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయంలో ఎక్కువ భాగం విలాసాల మీద ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూల అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. స్నేహితుల సహాయ సహాకారాలకు లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సజావుగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో పనిభారం బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ప్రతి ఫలం, గుర్తింపు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకుంటారు. మదుపులు, పెట్టుబడుల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛ, మిత్ర క్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. డిమాండ్ తో పాటు రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. చిన్నపాటి పెట్టుబడులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చేపట్టిన వ్యవ హారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
రాశ్యధిపతి రవి ప్రస్తుతం లాభ స్థానంలో శుభ గ్రహాలతో కలిసి ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రభుత్వమూలక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధించే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితంగా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది.
కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారడం వల్ల పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపో తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరిస్తున్న రాశ్యధిపతి శుక్రుడు 26న అష్టమ స్థానంలోకి మారడం జరుగుతోంది. వారం ప్రారంభంలో ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, ప్రేమ వ్యవ హారాల్లో విజయాలు సాధించడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. ఇక 26 నుంచి ప్రతి పనికీ కష్టపడాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో అపార్థాలు తలెత్తుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగాఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అనుకోని ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు, కార్యకలాపాలకు లోటుండదు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సీనియర్లను కాదని పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిన్నా చితకా సమ స్యలు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులకు విదే శాల నుంచి కొత్త ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు సప్తమంలో రవితో కలిసి ఉన్నందువల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రభుత్వం నుంచి లేదా రాజకీయ నాయకుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సోదరులతో సమస్యలు పరిష్కారమవుతాయి. కొందరు మిత్రుల మీద బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేషంగా లాభాలు కలుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట తొందరపాటు మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. బంధువులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. రావలసిన డబ్బు అవసరానికి చేతికి అందక ఇబ్బంది పడతారు. ఇవ్వాల్సిన వారు ఇవ్వక పోవడం, ఇవ్వవలసిన చోట ఒత్తిడి పెరగడం వంటివి కూడా జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఇతరులకు సహాయం చేయడం, వాగ్దానాలు చేయడం వంటివి పెట్టుకోకపోవడం మంచిది. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. పిల్లల విషయంలో కొద్దిగా శ్రద్ధ పెంచడం మంచిది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కుటుంబంలో సుఖ సంతో షాలకు లోటుండకపోవచ్చు. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరపడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు సమస్యలను పరిష్కరించుకుంటారు. కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఇవ్వక పోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.
Also read
- Garuda Puran: దహన సంస్కారాల తర్వాత స్మశానం నుంచి వస్తూ తిరిగి చూడడం అశుభం.. ఎందుకంటే
- Hindu Beliefs: రాత్రి గుడ్లగూబని చూడడం మంచిదేనా.. ఎటువంటి పక్షి కనిపిస్తే ఏ ఫలితం అంటే..
- Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు
- అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..
- ఆ ఇళ్లే వారి టార్గెట్.. ఒకే రోజు రెండు చోరీలు.. వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?
- కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టబయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!
- ఛీ ఛీ.. వీడు అసలు మనిషేనా.. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను గదిలోకి తీసుకెళ్లి..
- స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన వృద్ధురాలు.. ఒక్కసారిగా గీజర్ నుంచి మంటలు..!
- డ్రంక్ డ్రైవ్లో పట్టుబడ్డ యువకుడు.. కోర్టులో జరిమాన కట్టమన్న పోలీసులకు ఝలక్.. ఏం చేశాడంటే..
- Hyderabad: ఊరు కాని ఊరు వచ్చారు.. తల్లిదండ్రులను ఎదిరించి.. చిన్న విషయానికే ఇలా చేస్తారా..