దమ్మాలపాడు (ముప్పాళ్ళ): పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల పేరుతో ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన షేక్ నాగూర్ షరీఫ్‌కు పిడుగురాళ్లలో మెకానిక్ దుకాణం ఉంది. బుధవారం మధ్యాహ్నం పనిలో ఉండగా దుకాణం వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మరింత ఆందోళనకు గురైన నాగూర్ షరీఫ్ భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
తన భర్తపై ఎలాంటి కేసులు లేవని, పోలీసులమని చెప్పి మఫ్టీలో వచ్చి ఎలా తీసుకెళ్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. నాగూర్ షరీఫ్ ముప్పాళ్ల మండలం, తొండపి ఎంపీటీసీ బందెల హుస్సేనీ ్బ అల్లుడు. ఈనెల 28న ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామాకు తెరదీశారని ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ పదవిపై కన్నేసిన టీడీపీ శ్రేణులు తమ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





