రాత్రి సమయంలో ఆకాశం అనేక జీవులకు నిలయం. ఇలా రాత్రి సంచరించే జీవుల్లో గుడ్లగూబ వంటి పక్షులుకూడా ఉన్నాయి. ఈ గుడ్లగూబలు మర్మమైనవి. అయితే ఎవరైనా రాత్రి సమయంలో గుడ్లగూబను చూసినట్లు అయితే దాని అర్థం ఏమిటో తెలుసా.. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాత్రి గుడ్లగూబని చూడడం వెనుక ఉన్న అర్థాన్ని ఈ రోజు తెలుసుకోండి.
గుడ్లగూబకి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. ఈ పక్షి జ్ఞానం, అంతర దృష్టి రహస్యంతో ముడిపడి ఉంది. అయితే రాత్రి సమయంలో గుడ్లగూబని చూసినట్లు అయితే.. దాని అర్థం ఏమిటి? ఇది అదృష్టానికి సంకేతమా..? హెచ్చరికనా..? లేదా విశ్వం నుంచి వచ్చిన సందేశమా? తెలుసుకుందాం.
జ్యోతిష్యం ప్రకారం రాత్రి తెల్ల గుడ్లగూబ కనిపిస్తే
“హిందూ పురాణాలు, వేద జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రమైనది తెల్ల గుడ్లగూబ. దీనిని సంపద , శ్రేయస్సు అధిదేవత అయిన లక్ష్మీ దేవి వాహనం (వాహనం)గా పరిగణిస్తారు. కనుక ఎవరికైనా రాత్రి సమయంలో తెల్ల గుడ్లగూబ కనిపిస్తే అది శుభసూచకం. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని.. సానుకూల ఆధ్యాత్మిక పరివర్తన, దైవిక రక్షణ, మార్గదర్శకత్వాన్ని సూచిస్తుందని అంతేకాదు ఆర్ధికంగా లాభాలు అందుకోనున్నారని అర్ధమట. ఆర్ధిక సమృద్ధి కోసం మీరు చేసిన పూజలు ఫలించాయని సందేశం కూడా కావచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు.
రాత్రి సమయంలో సాధారణ గుడ్లగూబ కనిపిస్తే
రాత్రి సమయంలో నల్లగా లేదా సాధారణ గుడ్లగూబ కనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలని ఆధ్యాత్మికంగా హెచ్చరించబడుతున్నారని అర్థం. అయితే ఇది సంఘటన చుట్టూ ఉన్న శక్తిపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఇలాంటి గుడ్ల గూబ కనిపిస్తే కొన్ని హెచ్చరికలు కూడా చేస్తుందట. ప్రతికూల శక్తుల ఉనికిని , మీ వైపు లేదా మీ కుటుంబం వైపు మంత్రతంత్రం ప్రయోగం జరిగిందని.. కనుక శక్తివంతమైన రక్షణ కోసం ఆధ్యాత్మిక ప్రక్షాళన అవసరాన్ని తెలియజేస్తూ ఈ గుడ్లగూబలు హెచ్చరిస్తున్నాయట.
గుడ్ల గూబని చూస్తే చేయాల్సిన నివారణలు ఏమిటంటే
నీటిలో ఉప్పు వేసుకుని ఉప్పునీటి స్నానం చేయండి.
సంధ్యా సమయంలో ఇంట్లో పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించండి.
హనుమాన్ చాలీసా లేదా మహా మృత్యుంజయ మంత్రం వంటి రక్షణ మంత్రాలను జపించండి.
కర్పూరం , రాతి ఉప్పు వంటి సహజ రక్షణ సాధనాలతో ధూపం వేయండి.
రోజూ ఇంట్లో ధూపం వేసి క్రమం తప్పకుండా శక్తి ప్రక్షాళన ఆచారాలను కూడా నిర్వహించండి
Also read
- నేటి జాతకములు..16 జూలై, 2025
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!