SGSTV NEWS online
Andhra PradeshCrime

వివాహేతర సంబంధాల మోజులో కానిస్టేబుల్‌!



రాజానగరం(కోనసీమ): తన భర్త నుంచి తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలంటూ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై భార్య రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలను మంగళవారం ఎస్సై ఎస్‌.ప్రియకుమార్‌ విలేకరులకు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదులో తెలిసిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం తొర్రేడుకు చెందిన శాంతికి కాకినాడ రూరల్‌ మండలం మాధవపట్నానికి చెందిన నాగళ్ల రామకృష్ణంరాజుతో 2012 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామకృష్ణంరాజు ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే వివాహేతర సంబంధాలకు అలవాటు పడిన అతడు వివాహం అయినప్పటి నుంచి భార్య శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో విసిగిపోయిన శాంతి ఒకసారి ఆత్మహత్యకు యత్నించింది. అయినా రామకృష్ణంరాజు ప్రవర్తనలలో ఏ విధమైన మార్పు రాలేదు. దీంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని తొర్రేడుకు వచ్చి, ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ, పిల్లలను 7, 9 తరగతులు చదివించుకుంటోంది. రామకృష్ణంరాజు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండేవాడు.

ఈ క్రమంలో గత నెల 20న వచ్చిన అతను భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుంచి బలవంతంగా బయటకు నెట్టివేశాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేసి పంపించివేశారు. ఆ తర్వాత దీపావళికి వచ్చి మళ్లీ భార్యతో గొడవకు దిగాడు. ఈ సారి కొట్టడంతో పాటు జట్టు పట్టుకుని లాగేశాడు. భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కానరాకపోవడంతో విసిగిపోయిన శాంతి అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. 

Also read

Related posts