SGSTV NEWS
Spiritual

ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు ? ఈ రోజున ఉపవాసం ఉండడం వలన కలిగే ఫలితం ఏమిటంటే..

 

నిర్జల ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటారు. ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం..

సంవత్సరంలోని 24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఉపవాసంలో.. రోజంతా ఆహారం , నీరు లేకుండా ఉండవలసి ఉంటుంది. ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తికీ అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత పుణ్యం పొందుతాడని చెబుతారు. దీనిని భీమ సేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని.. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.అంతేకాదు ఆ వ్యక్తి వంశస్తులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని.. పూర్వీకులు పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారని నమ్మకం.

ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు?

వైదిక క్యాలెండర్ ప్రకారం నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి తిథి జూన్ 6న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు జూన్ 7న ఉదయం 4:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 6న పాటించాల్సి ఉంటుంది.



నిర్జల ఏకాదశిలో పూజించే విధానం నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటానికి సుర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి, సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. తరువాత భక్తితో, శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగా జలంతో పాటు పంచామృతంతో చేయండి, ఆ తర్వాత భక్తితో విష్ణువును పూజించండి. ఇప్పుడు పసుపు చందనం, పసుపు పువ్వులను స్వామికి సమర్పించండి. పూజ చేసే స్థలంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. రోజంతా ఆహారం లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి. నిర్జల ఏకాదశి ఉపవాస కథను చదివి రాత్రి దీప దానం చేసి.. విష్ణువుని పూజించి హారతి ఇవ్వండి.

ఉపవాస విరమణ సమయం నిర్జల ఏకాదశి ఉపవాసం విరమణ మరుసటి రోజు అంటే 2025 జూన్ 7న పాటించబడుతుంది. ఈ రోజు ఉపవాస విరమణకు సరైన సమయం మధ్యాహ్నం 1:44 నుంచి సాయంత్రం 4:31 వరకు.

Also read

Related posts

Share this