నోములు, వ్రతాలు, ప్రత్యేక పూజల సమయాల్లో కలశం పెట్టి పూజచేస్తుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ సమయాల్లో చాలా మంది బొమ్మల కొలువు పెడుతుంటారు. అప్పుడు కూడా కొందరు కలశ స్థాపన చేసి, గణపతి, లక్ష్మీ దేవినీ పూజిస్తారు. ఆ కలశని అమ్మవారిగా భావించి షోడశోపచార పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే, ఈ పూజ పూజ పూర్యయ్యాక ఆ కొబ్బరికాయ ఏం చేయాలి..? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పూజలో సమర్పించిన కొబ్బరికాయ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శాస్త్రాలలో దీనిని దేవతల ప్రసాదంగా భావిస్తారు. దీనిని తినడం వల్ల శుభ ఫలితాలు, సానుకూల శక్తి లభిస్తాయి. కొబ్బరి స్వచ్ఛత , అంకితభావానికి చిహ్నం. ఈ కొబ్బరికాయ తినడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం.
కొబ్బరికాయను ఎప్పుడూ పారవేయకూడదు … వృధా చేయకూడదు. కొబ్బరికాయను ఏదైనా ప్రత్యేక పూజలో సమర్పిస్తే, దానిని ఆలయానికి తీసుకెళ్లి భక్తులకు పంచిపెట్టొచ్చు. కొబ్బరి ప్రసాదం పంచితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుందని నమ్మకం. అందువల్ల పూజలో సమర్పించిన, కలశపై ఉంచిన కొబ్బరికాయను తినొచ్చు. అలాగే, కలశపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీకగా భావించి పూజిస్తారు. కాబట్టి, ఈ కొబ్బరి కాయ కూడా అంతే పవిత్రమైనది అంటున్నారు పండితులు
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..