నంద నందనుడు గోవుల కాచే గోపాల కృష్ణుడు.. గోపికల లోలుడు.. వెన్నదొంగ కృష్ణయ్యకు ఎక్కడైనా మీసాలు ఉంటాయా..? మీరు ఎక్కడైనా చూశారా..? ఉండవు అని ఇతిహాసాలు చూసినా, ఏ పురాతన చరిత్రలు విన్నా లేవనే చెబుతాయి.. కానీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో కోర మీసాల కృష్ణయ్య దర్శనమిస్తాడు. దీని వెనుక పెద్ద కథే ఉందంటున్నారు ఇక్కడి గ్రామస్తులు.. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
క్రీస్తుపూర్వం రాజుల పరిపాలనలో రాజులు కప్పం శిస్తు కట్టించుకునేవారు ప్రజలతో..అంతే కాకుండా ఊడిగం చేయించుకునేవారు. అయితే గ్రామస్తుల వద్ద డబ్బులు లేకపోవడంతో ఊరు ఊరంతా పైసా పైసా వేసుకుని ఓ గుడిని నిర్మాణం చేశారట. ఆ వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, గుడి చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. కానీ అందులో దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు గ్రామస్తుల వద్ద డబ్బులు లేక పోయేసరికి ఏం చేయాలో తెలియక, గ్రామ పెద్దలు కొంతమంది దేవుని విగ్రహం కోసం గ్రామాలలో వెతక సాగారు..అలా వెతుకుతున్న సమయంలో నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామ సమీపంలో ఓపాడు బడ్డ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కనిపించిందట..రాత్రిపూట ఆ విగ్రహాన్ని దొంగిలించి ఎడ్లబండ్లపై తీసుకువచ్చారట.. తీసుకువచ్చి ఊరు ప్రక్కనే ఉన్న చెరువులో దాచి ఉంచారట.
ఆ చెరువు పేరు కృష్ణమ్మ చెరువుగా పిలుస్తారు నేటికీ. ఇక దొంగతనం చేసి తీసుకువచ్చిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు గుర్తుపడతారేమో అన్న భయంతో గ్రామస్తులంతా కలిసి కృష్ణుని విగ్రహానికి వెండితో కోర మీసాలు చేయించి పెట్టారట. అలా మీసాలు పెట్టిన కృష్ణయ్య విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించారట..మీసాలు ఎందుకు పెట్టారట అంటే..ఆ గ్రామస్తులు వచ్చి విగ్రహాన్ని గుర్తుపట్టి దొంగతనం చేశారని అభియోగం మోపుతారనే భయంతోనే కృష్ణయ్యకు కోర మీసాలు పెట్టారట… అప్పటి నుండి ఈ గోపాలకృష్ణుని మీసాల కృష్ణుడిగా కొల్చుకుంటారట గ్రామస్తులంతా.
అంతేకాకుండా ఆనాడు ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నప్పుడు గుడిలో ఒక దీపాన్ని కూడా వెలిగించారట. దాన్ని నందా దీపం అని అంటారు.. ఆ దీపాన్ని ప్రతిష్టించిన నుండి ఇప్పటివరకు అలానే వెలగడం ఆ దేవుని మహిమే అని చెప్పుబుతున్నారు స్థానికులు..ఆ గుడి ముందు ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో నీరు ఎప్పుడూ ఎండిపోయిన దాఖలాలు కూడా లేవట. అందుకే ఈ మీసాల కృష్ణుడిని నిత్య పూజలతో కొలుస్తుంటారు భక్తులు.
వీడియో
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





