SGSTV NEWS
Famous Hindu Temples

Bhadrakali: దేవి శరన్నవరాత్రుల్లో భద్రకాళి అమ్మవారు ఎన్ని రూపాల్లో దర్శనమిస్తారో తెలుసా..?

తెలంగాణ ఇంద్రకీలాద్రి.. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నరాత్రి మహోత్సవాలు మహా వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో నవ దుర్గా అవతారాలలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.


తెలంగాణ ఇంద్రకీలాద్రి.. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నరాత్రి మహోత్సవాలు మహా వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో నవ దుర్గా అవతారాలలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విభిన్న రూపాల్లో దర్శనం ఇస్తున్న అమ్మవారి విశిష్టత ను మీరే చూడండి..


వరంగల్ పేరు చెప్పగానే కాకతీయులు కాలం నాటి పురాతన దేవాలయాలు.. భద్రకాళి అమ్మవారు గుర్తుకు వస్తారు.. గంభీర రూపంతో దర్శనం ఇచ్చే భద్రకాళి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు కరువు కాటకాలు దరిచేరవని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరి నవరాత్రి ఉత్సవాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అమావాస్య పాడ్యమి నుండి మొదలయ్యే ఈ ఉత్సవాలు ఏకాదశి రోజు భద్రకాళి బాద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలు, ఆకారాల్లో అమ్మవారి దర్శనమిస్తారు.

అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈనెల 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు..2వ అన్నపూర్ణాలంకరణ, 3వ రోజు గాయత్రి అలంకారం, 4వ రోజు శ్రీమహాలక్ష్మి అలంకారం, 5వ రోజు రాజరాజేశ్వరి లలితాదేవి అలంకారంలో, 6వ రోజు భవానీ అలంకారంలో, 7వ రోజు సరస్వతీ అలంకారంలో, 8వ శ్రీభద్రకాళి మహాదుర్గాలంకారం , 9వ రోజు మహిషాసురమర్థినీ అలంకారణలో భక్తులకు దర్శనం ఇస్తారు. 12వ తేదీ విజయదశమి సందర్భంగా విశేష పూజలు చేసి శ్రీ భద్రకాళి అమ్మవారికి జల క్రీడోత్సవం, హంస వాహన తెప్పోత్సవం నిర్వహిస్టారు.


నవ దుర్గ అలంకరణలతో దర్శనం ఇచ్చే అమ్మవారి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిత్య అన్నదానాలు, హోమా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రూపాల్లో దర్శనం ఇచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. భద్రకాళి అమ్మవారి పై సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఖరిరోజు 13వ తేదీన నిర్వహించే భద్రకాళి – భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం కనుల పండవగా సాగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రతియేటా సమ్ తింగ్ స్పెషల్ గా నిలుస్తుంది

Also read

Related posts

Share this