భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి
.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. గోదావరి నదిలో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. మొత్తం పది మంది వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులకు వెంటనే సహయక చర్యలు చేపట్టాలని సూచించారు.
నదిలో తప్పిపోయిన వారిలో అంబటిపల్లి గ్రామానికి చెందిన నలుగు యువకులు, కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులైన ఉన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గల్లంతమైన యువకుల కొరకు గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025