Girl gang raped siddipet: దసరా పండగ రోజు మైనర్ బాలికను మరో గ్రామానికి తీసుకెళ్లిన నిందితులు సాముహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Minor Girl gang raped in siddipet: ప్రభుత్వాలు ఎన్నికఠిన చర్యలు తీసుకున్న కామాంధుల్లో మార్పులు రావడం లేదు. ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. పసిపాప నుంచి పండు ముసలి వరకు అందరు వేధింపులకు గురౌతున్నారు. ముఖ్యంగా మైనర్ లపై దాడులు, అత్యాచారాలపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన కూడా నేరస్థుల్లో భయం మాత్రం ఉండటంలేదు.
సోషల్ మీడియా ప్రభావం, ఆన్ లైన్ లో ఆశ్లీల వీడియోలను చూసి కొంత మంది ఉన్మాదులగా మారుతున్నారు. వీరిలో మైనర్ లు కూడా ఉండటంతో సమాజం ఎటుపోతుందని అందరు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సిద్దిపేట్ జిల్లాలో ధూల్మిట్ట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దసరా పండగ రోజు బాలికను మరో గ్రామానికి తీసుకెళ్లి, మరుసటి రోజు ఉదయం గ్రామంలో వదిలేసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దారుణంకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. మరోవైపు గ్రామంలో గొడవలు జరక్కుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీసీ ఫుటేజీని జల్లెడపడుతున్నారు.
Also read
- Siddipet: సిద్దిపేట్లో దసరా రోజు ఘోరం.. మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం.. ఆలస్యంగా బైటపడ్డ ఘటన .!.
- Warangal: ఇదెక్కడి విడ్డూరం.. భార్య మాట్లాడటంలేదని ఏకంగా రైల్వే విద్యుత్ లైన్ ఎక్కిన భర్త.. వీడియో..
- హైదరాబాద్లో షాకింగ్ ఘటన.. వదినపై దాడి చేసిన మరిది..అసలు విషయం ఇదే.!.
- కూలి పనులకు తల్లిదండ్రులు.. ఇంట్లో ఆడుకుంటూ అనంతలోకాలకు ఏడాదిన్నర పాప..!
- Telangana: మూఢనమ్మకానికి బలైన మహిళ జీవితం.. దెయ్యం పేరుతో దారుణం..





