Husband angray on wife in warangal: తన భార్య మాట్లాడటంలేదని వరంగల్ కు చెందిన ఒక వ్యక్తి నెక్కొండ రైల్వే స్టేషన్ లో హల్ చల్ చేశాడు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లో గందర గోళం తలెత్తింది. ఈ వీడియో వైరల్గా మారింది.
సమాజంలో కొంత మంది భార్యభర్తలు ఇటీవల ప్రతి విషయాలకు గొడవలు పడుతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దది చేసుకుని డైవర్స్ వరకు వెళ్లిపొతున్నారు. మరికొంత మంది సుపారీలు ఇచ్చి మరీ కట్టుకున్న వారిని కాటికి పంపుతున్నారు. సంసారం అన్నక చిన్నపాటి గొడవలు, బేధాభిప్రాయాలు ఉంటాయి. వీటిని మాట్లాడుకుని సర్దుకుని పోకుండా, ప్రతి చిన్న విషయంను పెద్దది చేసుకుని కయ్యానికి ఒకరిపై మరోకరు కాళ్లుదువ్వుకుంటున్నారు. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన భర్త తన భార్య మాట్లాడటం లేదని ఏకంగా రైల్వేస్టేషన్ లో విద్యుత్ లైన్ మీద ఎక్కి హల్ చల్ చేశాడు.ఈ వీడియో వైరల్గా మారింది.
వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి కొన్ని రోజులుగా తన భార్య సుల్తాన్ సుబేర్ తనతో మాట్లాడటం లేదని రైల్వేస్టేషన్ కు వచ్చాడు. అందరు చూస్తుండగానే అక్కడున్న నెక్కొండ రైల్వేలైన్ మీద ఎక్కాడు.
కాసేపు అధికారులకు చుక్కలు చూపించాడు. కరెంట్ తీగల్ని ముట్టుకుంటానని, చచ్చిపోతానని నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. తనను భార్యతో మాట్లాడించాలని అధికారులతో వాగ్వాదంకు దిగాడు. ఈ క్రమంలో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని సముదాయించి అతడ్ని కిందకు దించి పీఎస్ కు తరలించారు. ఈ ఘటనతో వరంగల్ రైల్వేస్టేషన్ లో గందరగోళం తలెత్తింది. రైల్వే రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది.
Also read
- ఇన్స్టాగ్రామ్ పరిచయం.. ఇంట్లోనే ఆశ్రయం పొంది 4.5 తులాల బంగారం చోరీ!
- కార్తీక మంగళవారం ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందట.. రుణబాధలు తొలగాలంటే ఇలా చేయండి!
- Panchakshari Mantra: ఓం నమః శివాయకు ఇన్ని రూపాలున్నాయా? పంచాక్షరిలోని రకాల గురించి తెలుసా?
- కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!
- జనసేన నేత కోట రుక్మిణి రూ.7 కోట్ల చీటింగ్ కేసులో ట్విస్ట్





