కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షూట్ కోసం వెళ్లిన ముగ్గురు యవకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఇన్స్టా ద్వారా పరిచమయ్యారు. షార్ట్ ఫిలిమ్స్్స్ప ఆసక్తితో ఒకరికొకరు సాయం చేసుకోవాలని భావించారు. ఈనేపథ్యంలో కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నది వద్ద షార్ట్ ఫిలిం చిత్రీకరించేందుకు వెళ్లారు. అక్కడ షూట్ చేస్తుండగా, ముగ్గురూ అనూహ్యంగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హరిబాబు(25), హర్షవర్ధన్ (22) మృత దేహాలను వెలికితారు. కృష్ణచైతన్య(20) ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Also read
- అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు ఎందుకు వద్దంటారో తెలుసా?
- నేటి జాతకములు..10 అక్టోబర్, 2026
- అక్టోబర్ 10న కాకులకు ఆహారం పెట్టడం తప్పని సరి.. కాని ఆ పొరపాటు మాత్రం చేయకండి
- పూర్వీకులకు కృతజ్ఞత తెలిపి, వారి ఆశీస్సులు పొందే పవిత్రమైన రోజు.. తర్పణం ఎలా సమర్పించాలి?
- బేగంపేట్ లో నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారి హల్ చల్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు..





