అన్నానగర్: గోపాలపురంలో నడుచుకుంటూ వెళ్తున్న యువతినిలైంగికంగా వేధించిన బాలుడిని పోలీసులు పట్టుకుని జువైనల్ జస్టిస్ కమిటీ ముందు హాజరు పరిచారు. చెన్నైలోని రాయపేట ప్రాంతానికి చెందిన షేర్ నాథ్ 31 సంవత్సరాల యువతి. 28వ తేదీ ఉదయం గోపాలపురం 2వ వీధిలోని తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నది. ఆ సమయంలో 15 ఏళ్ల బాలుడు సైకిల్పై వచ్చాడు. నడుచుకుంటూ వెళ్తున్న యువతి ఎదురుగా సైకిల్ ఆపి ఎవరూ ఊహించని సమయంలో హఠాత్తుగా లైంగిక వేధింపులకు పాల్పడి పారిపోయాడు.
దీన్ని అస్సలు ఊహించని యువతి షాక్కు గురైంది. ఘటనపై వెంటనే రాయపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని బట్టి బాలుడిని గుర్తించారు. షేర్నాథ్ను లైంగికంగా వేధించిన బాలుడిని పట్టుకుని విచారించగా.. ఆమెను లైంగికంగా వేధించినట్లు బాలుడు అంగీకరించాడు. అతడి నుంచి సైకిల్ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు పట్టుకున్న బాలనేరస్తుడిని జువైనల్ జస్టిస్ కమిటీ ముందు హాజరుపరిచి ప్రభుత్వ అబ్జర్వేషన్ హోంకు అప్పగించారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





