దామెర/వర్ధన్నపేట: హాస్టల్ కు వెళ్లడం ఇష్టంలేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధనండాకు చెందిన గుగులోతు నందిని (13) టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పర్వతగిరి గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చింది.
సెలవులు ముగిసినా స్కూల్కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నందిని గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆందోళన చెంది గ్రామమంతా వెతుకుతున్న సమయంలో వ్యవసాయ బావి వద్ద కనిపించిందని తెలియడంతో బావిలో ఎంత వెదికినా లభించలేదు. తిరిగి శుక్రవారం ఉదయం బావిలో మరోసారి వెతకగా నందిని మృతదే హం దొరికింది. కేసు న మోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ తెలిపారు.
కాగా, హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండకు చెందిన గజ్జి పాల్ (16) ములుగు సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన బాలుడు తిరిగి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై గురువారం సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం బాలుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





