రైల్లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరి ప్రయాణికుల మధ్య సీటు కోసం గొడవ జరిగింది. మాట మాట పెరిగింది. అంతలోనే ఓ ప్రయాణికుడు తుపాకీ తీసి తోటి ప్రయాణికుడిని బెదిరించడంతో.. ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు గురి అయ్యారు. ఈ గొడవ అంతా దూరం నుంచి..
అనంతపురం, మార్చి 3: రైల్లో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరి ప్రయాణికుల మధ్య సీటు కోసం గొడవ జరిగింది. మాట మాట పెరిగింది. అంతలోనే ఓ ప్రయాణికుడు తుపాకీ తీసి తోటి ప్రయాణికుడిని బెదిరించడంతో.. ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు గురి అయ్యారు. ఈ గొడవ అంతా దూరం నుంచి చూస్తున్న ఓ ప్రయాణికుడు తుపాకీతో బెదిరిస్తున్న ప్రయాణికుడిని ఫోటోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అసలేం జరిగిందంటే..
యలహంక నుంచి కాచిగూడ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ఇద్దరు ప్రయాణికులు సీటు విషయంలో గొడవపడ్డారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఓ ప్రయాణికుడు తన దగ్గర ఉన్న తుపాకీ తీసి బెదిరించడంతో జనరల్ కోచ్ లోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ గొడవ జరుగుతున్న తంతును దూరం నుంచి మరో ప్రయాణికుడు ఫోటోలు తీసి జీఆర్పీ, ఆర్పిఎఫ్ పోలీసులకు వాట్సప్ లో ఫిర్యాదు చేశాడు. సరిగ్గా రైలు అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చాక ట్రైన్ ఆపి తుపాకీతో బెదిరించిన వ్యక్తిని పోలీసులు విచారించారు. తుపాకీతో బెదిరించిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం చెందిన మనోహర్ అనే రిటైర్డ్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పోలీసులు గుర్తించారు.
రిటైర్డ్ పోలీసు ఉద్యోగి వద్ద లైసెన్సుడ్ పిస్టల్ ఉందని పోలీసులు గుర్తించారు. అయితే అతడు తోటి ప్రయాణికులతో సీటు కోసం గొడవపడి భయభ్రాంతులకు గురి చేసే విధంగా తుపాకీ తీసి బెదిరించడాన్ని రైల్వే పోలీసులు సీరియస్ గా పరిగణించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో లైసెన్స్ వెపన్ బయటకు తీసి తుపాకీతో బెదిరించిన ఘటనను పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. ఫోటోలు తీసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైలు ప్రయాణం ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న సమయంలో తుపాకీతో బెదిరించడంతో ట్రైన్ లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు
Also read
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే





