ఇంట్లో వాస్తు సమస్యలు ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. అందుకే వాస్తు నిపుణులు ఎన్నో చిట్కాలను చెబుతూ ఉంటారు. ఇంట్లో ధనం, సుఖం, శాంతి పెరగాలంటే వాస్తు ప్రకారం ఒక చిట్కా ఉంది. మన సంప్రదాయాల్లో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయాల్లో పూజల సమయంలో శంఖం ఊదడం చూస్తూనే ఉంటాం. కానీ అది కేవలం ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక వాస్తు నమ్మకాలు కూడా ఉన్నాయి. శంఖం శబ్దం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని విశ్వసిస్తారు. అందుకే చాలామంది పూజ గదిలో శంఖాన్ని ఉంచుతారు.
ఎలాంటి శంఖం?
వాస్తు ప్రకారం శంఖం ఇంట్లో ఉంటే శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు లేదా ఈశాన్య దిశలో పూజ గదిలో ఉంచితే మంచిదట.
శంఖం నోరు ఇంటి లోపల వైపు ఉండేలా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉంచితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోనే నిలిచి ఉంటుందని అంటారు. శంఖం సహజమైనదే తేవాలి. ప్లాస్టిక్ లేదా అలంకరణ కోసం తయారు చేసిన కృత్రిమ శంఖాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. శంఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. గంగాజలంతో కడిగి పూజ గదిలో ఉంచితే మంచిది.
దక్షిణావర్తి శంఖం
శంఖాలలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో దక్షిణావర్తి శంఖం ఎంతో ప్రత్యేకమైనది. ఇది కుడి వైపు తిరిగిన ఆకారంలో ఉంటుంది. దీనికి లక్ష్మీ దేవితో అనుబంధం ఉందని నమ్ముతారు. ఈ శంఖం ఇంట్లో ఉంటే ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు. అందుకే చాలా మంది దీనిని కొనుగోలు చేసి పూజ గదిలో పెట్టుకుంటారు.
వామావర్తి శంఖం
వామావర్తి శంఖం కూడా ఎంతో మంచిది. ఇది ఎడమ వైపు తిరిగిన ఆకారంలో ఉంటుంది. దీన్ని సాధారణంగా పూజల సమయంలో ఊదుతారు. దీని శబ్దం ఇంట్లో శాంతి వాతావరణాన్ని కలిగిస్తుందని చెబుతారు. ముఖ్యంగా పూజ ప్రారంభంలో లేదా సాయంత్రం దీపారాధన సమయంలో శంఖం ఊదితే మంచి శక్తి వ్యాపిస్తుందని పెద్దలు అంటారు. అయితే ఇంట్లో శంఖం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. నేలపై నేరుగా ఉంచడం, బాత్రూమ్ దగ్గర పెట్టడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే పగిలిపోయిన శంఖాన్ని ఇంట్లో ఉంచకూడదు. అది శుభకరం కాదు.
శంఖం పూజగదిలో ఉంచడమే కాదు, దాన్ని భక్తితో, శుభ్రతతో చూసుకోవడం కూడా ముఖ్యం. ప్రతి రోజు పూజ సమయంలో కొద్దిసేపు శంఖం ఊదితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. కొందరు దీనిని నీటితో నింపి ఇంటి చుట్టూ చల్లి పరిశుభ్రం చేస్తారు. శంఖం కేవలం ఒక అలంకరణ వస్తువు కాదు. మన సంప్రదాయం, విశ్వాసం, వాస్తు నమ్మకాలతో కలిసిన పవిత్ర చిహ్నం. ఇంట్లో శాంతి లేకపోయినా, చిన్నచిన్న సమస్యలు ఎదురవుతున్నా వాస్తు ప్రకారం శంఖాన్ని సరైన దిశలో ఉంచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది తమ అనుభవాల ఆధారంగా శంఖం ఉంచిన తర్వాత ఇంట్లో సానుకూల మార్పులు కనిపించాయని చెబుతున్నారు. శంఖం కొనుక్కుని ఇంట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించండి. సరైన దిశలో, శుభ్రంగా, భక్తితో ఉంచితే ఇంటికి శుభఫలితాలు వస్తాయని వాస్తు నమ్మకం. ధనం, సుఖం, శాంతి కోరుకునే వారు ఒకసారి శంఖాన్ని ఇంట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
Also read
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే





