నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో కొంత భాగం తనది కాదని రెవెన్యూ అధికారులు చెబుతుండటంతో రైతు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆత్మకూరు, : నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో కొంత భాగం తనది కాదని రెవెన్యూ అధికారులు చెబుతుండటంతో రైతు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నువ్వూరుపాడులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం… నువ్వూరుపాడు పంచాయతీ పాత జంగాలపల్లిలో ఎస్సీ కాలనీకి చెందిన రైతు కత్తి పుల్లయ్య(55) రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. భూమికి సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయి. రెండేళ్ల క్రితం అధికారులు రీసర్వే చేసి… రెండెకరాలే ఉందని చెప్పారు. మిగిలిన అరెకరం పక్కవారిదని, వారికి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచి పుల్లయ్య అధికారుల చుట్టూ తిరుగుతూ తన గోడు వినిపించారు. గత నెలలో నువ్వూరుపాడులో పర్యటించిన కలెక్టర్ ఆనంద్కు సమస్యను విన్నవించారు. వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. మళ్లీ సర్వే చేస్తామంటూ పుల్లయ్యకు అధికారులు మంగళవారం సమాచారమిచ్చారు. సర్వే చేసినా నీకు దక్కేది రెండెకరాలే అని కొందరు ఆయనతో చెప్పారు. దీంతో మానసికంగా వేదనకు గురైన పుల్లయ్య… ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





