గోపాలపురం: విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని కుమ్మరికుంట కాలనీలో జరిగింది. గ్రామానికి చెందిన పెంటబోయిన అప్పల నరసమ్మ(53), పెంటబోయిన పెద్ద బంగారయ్య(57) భార్యాభర్తలు. ఈ రోజు ఉదయం నరసమ్మ ఉతికిన దుస్తులను ఆరేస్తుండగా.. తమ ఇల్లు(రేకులషెడ్)కు ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. అక్కడే ఉన్న బంగారయ్య.. భార్యను కాపాడబోయి తాను కూడా విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
- Dhanteras: ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవస్వరూపం
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- హైదరాబాద్లో తీవ్ర విషాదం.. నీట్లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
- ఓవైపు అర్నబ్ తుఫాన్.. మరోవైపు ఇంజిన్ ఫెయిల్.. అంతర్వేదికి కొట్టుకొచ్చిన మర్చంట్ షిప్..





