తెలంగాణ,నందిపేట్(ఆర్మూర్)అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకు తెలియకుండా ప్రేమ వివాహం చేసు కోవడాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వెల్మల్ గ్రామానికి చెందిన బండకాడి రాజన్న (50)కు నలుగురు కూతుళ్లు. ముగ్గురికి వివాహమైంది. చిన్నకూతురు (19) ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ఆమె గ్రామానికి చెందిన యువ కుడిని ప్రేమించింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిద్దరు పారిపోయి బుధవారం పెళ్లి చేసుకున్నారు.
అయితే కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన రాజన్న.. గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బండకాడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై వినయ్ తెలిపారు.
Also read
- రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
- Dhanteras: ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవస్వరూపం
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- హైదరాబాద్లో తీవ్ర విషాదం.. నీట్లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
- ఓవైపు అర్నబ్ తుఫాన్.. మరోవైపు ఇంజిన్ ఫెయిల్.. అంతర్వేదికి కొట్టుకొచ్చిన మర్చంట్ షిప్..





