SGSTV NEWS online
Crime

Crime: అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..


ఓ వ్యక్తి మైనర్ను బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది.

లఖ్నవూ: ఓ వ్యక్తి మైనర్ను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఫోరీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న అమన్(22) అనే యువకుడు.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ బాలిక వెంట పడ్డాడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన అతడు ఆమెను బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాల్చిన ఇనుప రాడ్డుతో బాలిక ముఖంపై తన పేరు రాశాడు. అనంతరం బాలిక అతడి నుంచి తప్పించుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న మైనర్ను గుర్తించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Also read

Related posts