SGSTV NEWS
Andhra PradeshCrime

ఏపీలో దారుణం.. నవ వధువుపై అత్యాచారయత్నం!


ఏపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో దారుణజరిగింది. అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన నవ వధువుపై అత్యాచార యత్నం జరిగింది. భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమోదైంది.

ఏపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో దారుణం జరిగింది. అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన నవ వధువుపై అత్యాచార యత్నం జరిగింది. భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమోదైంది. అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు గుర్తించి అడ్డుకున్నాడు. దీంతో నిందుతులు అక్కడినుంచి పారిపోగా ఈ ఘటనతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతోంది. భర్త, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అమరావతి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పరారీలోవున్న నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం సొంత తల్లిదండ్రులే మూడేళ్ల కుమార్తెను విక్రయించారు. ఉపాధి కోసం కేరళకు వెళ్లినరవీంద్రనాయక్‌, శ్రీవాణి దంపతులు రూ.10 లక్షలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు విషయం అడగడంతో వారు వివాదానికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share this