అమీర్పేట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఆర్నగర్ పోలీస్టేషన్ పరిధిలోని మూడు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. బీకే గూడలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీసీఎస్ యాంటీ ట్రాఫికింగ్ వింగ్ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు
యూసుఫ్గూడకు చెందిన స్పా సెంటర్ నిర్వాహకురాలు నడిమింటి అనూష, కార్మికనగర్కు చెందిన విటుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినయ్ బాబుతో పాటు ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. అదే విధంగా అమీర్పేట విఠల్ చాంబర్స్లోని 2వ అంతస్తులో గ్లోరీ ఫిజియోథెరపీ హాస్పిటాలిటీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బోరబండకు చెందిన స్పా సెంటర్ యజమాని టి.కళ్యాణి, ఐడీపీఎల్ చింతల్కు చెందిన అశోక్ కుమార్, మియాపూర్ నివాసి సాంబశివరెడ్డితో పాటు నలుగురు మహిళలను అరెస్టు చేశారు.
అమీర్పేట గురుద్వారా సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఎన్.ఎస్.బ్యూటీ సెలూన్ ఆండ్ స్పా సెంటర్లో ఎస్ఆర్నగర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదిలాబాద్కు చెందిన నిర్వాహకురాలు సుధ, వెస్ట్ గోదావరికి చెందిన విటుడు సాగిరాజు దినేష్ వర్మ, వరంగల్కు చెందిన గౌతమ్, కుత్బుల్లాపూర్ నివాసి రవికుమార్, బంజారాహిల్స్కు చెందిన చవన్ సురేందదర్, గుంటూరుకు చెందిన పిన్ని ప్రవీణ్ కుమార్, వెస్ట్ బెంగాలు చెందిన ఒక యువతిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసులను ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు.
Also read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





