ఆర్కేనగర్ (తమిళనాడు) : నిన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆరోపిస్తూ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వేలూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనవడంతో వెంటనే అలీఖాన్‌ను గుడియాత్తంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఐసియులో చికిత్స పొందుతున్నారు. తనకు పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని ఆరోపిస్తూ … మస్సూర్ అలీఖాన్ ప్రకటన విడుదల చేశారు. తాను గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్లరసం, మజ్జిగ ఇచ్చారని… పండ్లరసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!