భయంతో గుంత తీసి పూడ్చిన మరో బాలుడు
గూడూరు పట్టణం : ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది. అది పెద్దదై చివరికి ఒకరి ప్రాణాలు తీసేదాకా వెళ్లింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు సమీపంలోని చెన్నూరు బిట్-2 మర్రిపల్లిమడుగు ప్రాంతంలోని ఒక తోటలో ఈ ఘటన జరిగింది. గూడూరు గ్రామీణ ఎస్సై తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం… ఆ తోటలోనే ఇద్దరు బాలల తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. సమీపంలోనే చెన్నూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు, సైదాపురం మండలానికి చెందిన పదిహేడేళ్ల బాలుడు ఇటీవల ఫోన్ చూస్తూ ఆడుకుంటున్నారు. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో పదిహేడేళ్ల బాలుడు గొంతు నులుమడంతో మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భీతిల్లిన ఆ బాలుడు.. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక తోటలోనే పూడ్చేశాడు. బాలుడు అదృశ్యమైనట్టు ఈనెల 17న తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహం బయటపడింది. పోలీసులు విచారణలో పదిహేడేళ్ల బాలుడు తానే దారుణానికి పాల్పడ్డానని అంగీకరించాడు. సోమవారం బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నెల్లూరులోని జువనైల్ హోంకు తరలించారు.
Also read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





