అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. సింపతీ కోసం సొంతంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి ఆడిన నాటకమిదని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.
Pastor Abhinay’s case : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. తనపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారంటూ స్వయంగా ఆయనే సృష్టించుకున్న ఈ ‘దాడి’ వెనుక అసలు నిజాలను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రజాదరణ, సింపతీ కోసం సొంతంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి ఆడిన నాటకమిదని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగింది?
గత కొన్ని రోజులుగా పాస్టర్ అభినయ్ దర్శన్ ‘భరోసా పార్టీ’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాడేరులో తన కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేశారని, ఆ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని అభినయ్ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం చేశారు.”నన్ను పాడేరు వదిలి వెళ్లిపోవాలని గతంలో బెదిరించారు. నేను వెళ్లకపోవడంతోనే ఈ దాడికి తెగబడ్డారు” అని ఆయన ఆరోపించారు.గతంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ లాగే నన్ను కూడా చంపేయడానికి కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ దాడిపై మొదటి నుంచీ పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తోటి పాస్టర్ల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. “దాడి జరుగుతున్నప్పుడు ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించకుండా, చాలా ఓపిగ్గా వీడియోలు ఎలా తీసుకున్నారు?” అని మరో వర్గం పాస్టర్లు ప్రశ్నించారు. ఇదంతా కేవలం అభినయ్ ఆడుతున్న డ్రామా అంటూ వారు కొట్టిపారేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో సింపతీ కొట్టేయడానికి అభినయ్ ఐదుగురు సభ్యులతో కలిసి ఈ ముందస్తు స్కెచ్ వేసినట్లు పోలీసులు తేల్చారు.
దొరికిపోయిన ఆధారాలు ఇవే:
తనపై దాడి ఎక్కడ జరగాలి? ఎలా దాడి చేయాలి? కారు అద్దాలు ఎలా పగలగొట్టాలి? శరీరంలో ఏ భాగాలపై, ఎలా పొడవాలో క్లియర్ కట్‌గా వివరిస్తూ అభినయ్ మాట్లాడిన ఆడియో సందేశాలు బయటకు వచ్చాయి
ఈ ఆడియోలు,నిందితుల వీడియోలు ప్రస్తుతం వెలుగుచూశాయి. దాడికి సంబంధించిన ప్లానింగ్ అంతా వాట్సాప్ చాటింగ్ ద్వారా జరిగినట్లు పోలీసులు గుర్తించారు.నిందితుల్లో ఒకరి భార్యకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌ను ట్రాక్ చేయడం ద్వారా పోలీసులకు ఈ ముందస్తు స్కెచ్‌కు సంబంధించిన బలమైన ఆధారాలు లభించాయి.
రాజకీయ లేదా వ్యక్తిగత మైలేజ్ కోసం, కేవలం జనం నుంచి సానుభూతి (సింపతీ) పొందడానికే పాస్టర్ అభినయ్ ఈ బీభత్సమైన ప్లాన్ వేశారని విచారణలో స్పష్టమైంది. పక్కా ప్లాన్‌తో నాటకమాడి, సమాజంలో అలజడి సృష్టించాలని చూసిన పాస్టర్ అభినయ్.. పోలీసుల దర్యాప్తుతో ఇప్పుడు చట్టానికి అడ్డంగా దొరికిపోయారు.
Also read
- ఏసీబీ వలలో జలమండలి తిమింగలం.. కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు.. విస్తుపోయే ఆస్తులు!
- అమ్మతనానికే మచ్చ.. తన సుఖం కోసం కన్నబిడ్డను బలి తీసుకున్న కసాయి తల్లి!
- Shocking Video: హైదరాబాద్ లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళను.
- Pastor Abhinay’s case : పాస్టర్ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్…దాడిని డ్రామాగా తేల్చిన పోలీసులు
- ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. రెండ్రోజులకే





