SGSTV NEWS
Andhra PradeshEntertainment

*ఒకే ఒక్కడు మన బ్రాహ్మణ జాతి గౌరవాన్ని కాపాడాడు…. అతడే…. మన శిరిపురపు శ్రీధర్..!!!*



ఈ కన్నప్ప పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే సీన్లు ఉన్నాయని మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు నిర్మాతలుగా నిర్మించి, నటించిన “పిలక-గిలక”అంటూ బ్రహ్మానందం మరియు సప్తగిరి ఫోటోలతో రిలీజ్చేసిన పోస్టర్ల ద్వారా -తెలుసుకొని ఆనాటినుండే ఉద్యమాన్ని చేపట్టారు గుంటూరుకు చెందిన బ్రాహ్మణ చైతన్యవేదిక పేరుతో  బ్రాహ్మణులను జాగృతం చేసే ఉద్యమకారుడు శ్రీ శిరిపురపు శ్రీధర్. వీరు గతంలో ఇదే మంచు విష్ణు నటించిన “దేనికైనా రెడీ “చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే సీన్లను తొలగించాలని 2012లో తొలుతగా గుంటూరులో పెద్ద ఉద్యమాన్నే ఆయన చేశారు. ఆ తర్వాతే ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమాపై పెద్ద ఉద్యమమే జరిగింది. వీరే అపుడు హైకోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆర్డర్ వచ్చేలోగా సినిమా రిలీజ్ కావడం అనంతరం వందలాదిమంది బ్రాహ్మణ సోదరులు (శ్రీ శిరిపురపు శ్రీధర్ పిలుపుతో) మోహన్ బాబు ఇంటిపైకి వెళ్ళి తమ నిరసనను తెలియజేయబోగా, మోహన్ బాబు వారి బౌన్సర్లపై మన సోదరులపై భౌతిక దాడి జరిగిన విషయం మీకు తెలియందికాదు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు నాలుగు సన్నివేశాలు కట్ చేయమని సెన్సార్ బోర్డుకి తీర్పునిచ్చింది. సినిమా విడుదలై సినిమా హాల్స్ నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది అప్పుడు.



కాగా ఇప్పుడు దొరికాడు మనకు కాదు…. శిరిపురపు శ్రీధర్కు ఆయన అభ్యంతరాలను వాట్సాఫ్ ద్వారా, ప్రచారమాధ్యమాల ద్వారా, రోడ్లపై నిరసన ధర్నాల ద్వారా పెద్ద ఉద్యమమే చేయడమేగాక, సెన్సార్ బోర్డుకు తన అభ్యంతరాలను బి.జే.పి. మరియు ప్రధానమంత్రి కార్యాలయం వరకు పెద్దల సహకారంతో సెన్సార్ దృష్టికి తీసుకెళ్ళారు. అనంతరం హైదరాబాద్ సెన్సార్ వర్డ్ కార్యాలయంలో కేవలం 4 గురు సభ్యులుగల రీజనల్ సెన్సార్బోర్డు 3సీన్లు మాత్రమే కట్ చేయగా, మరికొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఇంకా అనేక సీన్లు కట్చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. అప్పుడు 11మంది సభ్యులుగా ఉన్న రివిజన్ కమిటీ వారి ఆధ్వర్యంలో సి.బి.యఫ్.సి వారు కన్నప్ప సినిమాను పరిశీలించి బ్రాహ్మణులకు మరియూ ఆధ్యాత్మికతకు భిన్నంగా ఉన్న సీన్లు, శృంగార భరిత సీన్లు మొత్తం 13 సీన్లను తొలగిస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని మంచు మోహన్ బాబు మంచు విష్ణు లకు సెన్సార్ బోర్డు వారు వెల్లడించడంతో తప్పని పరిస్థితిలో ఆయా అభ్యంతరకర సీన్లు తొలగించి అంతర్జాతీయంగా జూన్ 27వతేదీన “కన్నప్ప” విడుదల చేయగలిగారు. ఈ సినిమాపై హైకోర్టులో రిట్ఫిటిషన్ నెం. 6236 తో ఫైల్ అయింది.. ఈ కేసును హైకోర్టు న్యాయవాది రాజమానూరి సుమంత్ శర్మ వాదిస్తున్నారు. గతంలో శ్రీధర్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో దైనికైనా రెడీ చిత్రంపై ఒక క్రిస్టియన్ న్యాయవాది అయిన ఆంధోని రెడ్డి ఆ కేసును వాదించారు.



“సోదప్ప” సినిమాపై బ్రాహ్మణ చైతన్య వేదిక సిరిపురపు  శ్రీధర్ ద్వారా గుంటూరు బ్రాహ్మణుల పోరాటం సక్సెస్ జరిగింది.



కన్నప్ప సినిమాపై శ్రీధర్ చేస్తున్న పోరాటాన్ని ఈ సినిమా డైలాగ్ రచయిత బ్రాహ్మణుడు ఆయన ఆకెళ్ళ శివప్రసాద్, సినిమా దర్శకుడు సింగ్ ఇద్దరూ ఖండించారు . చిత్ర నిర్మాతలు వాటిలోని 13 సీన్లను సంయమనం చేసుకొని తొలగించారు. మంచు విష్ణు మంచి మోహన్ బాబు తప్పని పరిస్థితుల్లో  సుమారు 12 నిమిషాలు నిడివి గల  13 సీన్లను తొలగించి చివరికి సినిమా రిలీజ్ చేశారు. శిరిపురపుశ్రీధర్ వల్లనే నేడు బ్రాహ్మణజాతి నిలబడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో బ్రాహ్మణ సంఘాలు ఎన్ని ఉన్నా సరే ఎవరూ చేయని ధైర్యం, తెగింపు చేసి సెన్సార్ దృష్టికి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి బ్రాహ్మణుల గౌరవం కాపాడిన వీరిని “యజ్ఞోపవీతం” మాసపత్రిక మరియు ఎస్ జి ఎస్ న్యూస్ ఛానల్ శ్రీధర్ గారిని అభినందిస్తున్నది. వీరిని స్ఫూర్తిగా తీసుకుని బ్రాహ్మణులను అగౌరవపరిచి,జోకర్లగా,హాస్యనటులుగా చూపించే సినిమాలు మరియు బ్రాహ్మణుని కించపరిచే రాజకీయనాయకులకు తగు గుణపాఠం చెప్తారని కోరతున్నాం. “కన్నప్ప” చిత్రం గుంటూరులో 7-6-2025న జరిగిన ఫ్రీరిలీజ్ ఫంక్షన్ రోజునా కూడా గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక నేతృత్వంలో ఏపీ అర్చక సేవా సంఘం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ఉద్యమం జరిపి, గుంటూరు వచ్చిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు లకు దమ్ముగా సవాల్ విసిరిన సిరిపురపు శ్రీధర్ శర్మకు, బ్రాహ్మణ చైతన్య వేదిక వారి వెంట ఉన్న సభ్యులకు, బ్రాహ్మణ సోదరీ సోదరులకు ప్రత్యేకంగా బ్రాహ్మణ జాతి తరుపున వారినందరినీ అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

సేకరణ :యజ్ఞోపవీతం  పత్రిక నుండి

Also read

Related posts

Share this