SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: లవర్‌ మోజులో భార్యపై మర్డర్ స్కెచ్..చివరికి కుటుంబ సభ్యులు మొత్తం..


అన్నమయ్య జిల్లా బండార్లపల్లెలో ఇందుజ అనే యువతిని ఆమె భర్త విజయ్‌ శేఖర్‌ రెడ్డి హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మొదట ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒప్పుకున్నారు నిందితులు.

AP Crime: నేటి కాలంలో భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతుంది. వ్యక్తిగత సుఖాల కోసం ఎంతటికైనా దిగజారుతున్నారు. పార్ట్‌ టైం జాబ్‌ లాగా.. పార్ట్‌ టైం లవర్ మోజులో పడి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో కలకలం రేపుతోంది. స్థానిక వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం బండార్లపల్లెలో జూన్ 28న చోటుచేసుకున్న ఓ హత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇందుజ అనే యువతిని ఆమె భర్త విజయ్‌ శేఖర్‌ రెడ్డి హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మొదట ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.

పక్క ప్లాన్‌లో మర్డర్..
విజయ్‌ శేఖర్ రెడ్డి ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం ఇందుజకు తెలిసింది. భార్య ఈ వ్యవహారానికి అడ్డుగా మారుతుందన్న భావనతో ఆమెను దూరం చేయాలనే పథకం వేసిన విజయ్‌, తన తల్లి, అక్క, అమ్మమ్మ సహకారంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. హత్య అనంతరం భార్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందంటూ నటించారు. అయితే ఇందుజ తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు

దర్యాప్తులో భర్త నాటకం బయటపడింది. ఇందుజను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారన్నది స్పష్టమైంది. మృతదేహంపై ఉన్న గాయాలు.. విరుద్ధంగా ఉన్న భర్త కథనం పోలీసులకు అనుమానాలు కలిగించాయి. తరువాత విచారణలో విజయ్‌శేఖర్‌రెడ్డితోపాటు అతని తల్లి, అక్క, అమ్మమ్మ హత్యకు సహకరించినట్టు పోలీసుల వద్ద అంగీకరించారు. పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేసి మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడీ కేసు పీలేరు ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. ఘోరంగా జరిగిన ఈ హత్య ఘటన స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. నిందితులు కఠినంగా శిక్షించాలని ఇందుజ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also read

Related posts

Share this