కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగష్టు : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిటుకుల పోచయ్య(38) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.మృతుడు పోచయ్య తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృత్యున్నట్లు మృతుని భార్య పారిజాతం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





