గుంటూరు : గుంటూరులో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబుకాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబసభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి, తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి, ట్రాన్స్ జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడిరోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా.. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేశామని నగరంపాలెం సీఐ సత్యనారాయణ తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





