పాతబస్టాండ్(నారాయణపేట): నారాయణపేట జిల్లా కేంద్రంలో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నారాయణపేట పట్టణానికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పదేళ్ల కిందట భర్త మృతి చెందారు. పెద్ద కుమార్తె(15) కూలిపని చేస్తోంది. పట్టణంలోని అశోకనగర్కు చెందిన ఫైజల్(20) కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడుతున్నాడు. బక్రీద్ సందర్భంగా యువకుడు బాలికతో కలిసి ద్విచక్ర వాహనంపై నారాయణ పేటలో పర్యటించాడు. ఈ విషయం ఫైజల్ కుటుంబీకులకు తెలిసింది. ఆదివారం ఉదయం బాలిక ఇంటికి ఫైజల్ వెళ్లాడు. అక్కడేం జరిగిందో.. యువకుడు ఇంటినుంచి బయటకు వెళ్లగానే బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహంతో బాలిక కుటుంబీకులు, స్థానికులు పాతబస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు.
విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు.మేరకు కేసు నమోదు చేసి నిందితుడు ఫైజల్ను అరెస్టు చేసినట్లు సీఐ శివశంకర్ తెలిపారు.
Also read
- పటాన్ చెరువు ఓఆర్ఆర్ పరిధిలో మహిళ దారుణ హత్య
- కొనసాగుతున్న దళితులపై దాడుల పరంపర….ఐ.యఫ్.టి.యు
- బస్టాండ్ లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
- కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?
- Hyderabad: ఓల్డ్‌సిటీ ప్రైవేట్ స్కూల్లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్ వర్క్..





