దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు.
ఊర్కొండ, న్యూస్‌టుడే: దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు. దైవదర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్టప్రాంతంలోకి వెళ్లగా.. అక్కడ మాటువేసి ఉన్న యువకులు ఆమెను అటకాయించారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు. యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులుగా గుర్తించిన పోలీసులు.. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.
Also read
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





