ఊర్కొండ, కుంటలో ఈతకు దిగిన పిల్లల్ని మృత్యువు కబళించింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, రజిని దంపతులకు కుమార్తె సిరి(14), కుమారుడు శ్రీమాన్షు(12)…, శ్రీకాంత్ సోదరి చంద్రకళకు కుమార్తె స్నేహ(17) సంతానం. హైదరాబాద్ లో స్నేహ ఇంటర్, సిరి పదోతరగతి, శ్రీమాన్షు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. శ్రీకాంత్ తల్లికి అనారోగ్యంగా ఉండటంతో పాటు, సెలవులు రావడంతో ఈ ముగ్గురూ గ్రామానికి వచ్చారు. గ్రామ శివారున ఉన్న పొలానికి శ్రీకాంత్తోతో పాటు వెళ్లారు. సరదాగా గడిపారు. పిల్లలు ముగ్గురూ సమీపంలోని కుంటలో ఈతకు దిగి మునిగిపోయారు. కాపాడాలని పిల్లలు కేకలు పెడుతున్నా ఈత రాని శ్రీకాంత్‌రెడ్డికి ఏం చేయాలో పాలుపోలేదు. వడివడిగా వెళ్లి సమీపంలోని రైతుల్ని తీసుకొచ్చి వారిని బయటకు తీసేసరికే ముగ్గురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
Also read
- Kidney Patients: కిడ్నీ రోగులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమవుతుంది..
- గోత్రం తెలియక పోతే పేరుతో అర్చన చేయించుకోవచ్చా……
- Moon Double Transit: శని జయంతి నాడు చంద్రుడి డబుల్ ధమాకా.. ఈ 3 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు.. ఇక అంతా శుభమే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వస్తావా.? అని అడిగారు.. తీరా వెళ్లాక అసలు సినిమా చూపించింది.!




