హైదరాబాద్: ఆమె వివాహిత. వయసు 46. అతడు 23 ఏళ్ల యువకుడు. వీరిద్దరికీ ఇన్స్టాలో పరిచయం ప్రణయానికి దారి తీసింది. ఆదివారం వీరు నగరం నుంచి అదృశ్యమయ్యారు. జూబ్లీహిల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. బిహారు చెందిన మహిళ (46)కు భర్త, 19, 16 ఏళ్లున్న కుమారుడు, కూతురు ఉన్నారు. 2004లో నగరానికి వలస వచ్చారు. జూబ్లీహిల్స్లోలో ఆమె భర్త వంట మనిషిగా, సదరు మహిళ పని మనిషిగా పని చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన 23 ఏళ్ల యువకుడితో ఆమెకు ఇన్స్టాలో పరిచయమైంది. ప్రేమలో పడిన వీరు నగరంలో తరచూ కలుసుకునేవారు. ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి పరారయ్యారు. భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో వివాహితతో పాటు యువకుడు బైక్పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీరి కోసం గాలిస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.
Also read
- Kidney Patients: కిడ్నీ రోగులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమవుతుంది..
- గోత్రం తెలియక పోతే పేరుతో అర్చన చేయించుకోవచ్చా……
- Moon Double Transit: శని జయంతి నాడు చంద్రుడి డబుల్ ధమాకా.. ఈ 3 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు.. ఇక అంతా శుభమే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వస్తావా.? అని అడిగారు.. తీరా వెళ్లాక అసలు సినిమా చూపించింది.!




