కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలంలో ఓ లారీ.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెతో సహా మరో యువతి మృతిచెందింది. దీంతో, కుటుంబం సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపు వద్ద మొరం లోడ్‌తో వస్తున్న లారీ.. బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మొరం బైక్‌పై వెళ్లున్న వారిపై పడింది. మట్టిలో వారు ముగ్గురు కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం, జేసీబీ సాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు.
ఇక, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు ఉన్నారు. మృతి చెందిన వారిని విజయ్, సింధుజ, వర్షలుగా గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, బోర్నవల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





