తమ సమస్యలు పరిష్కరించలేదని నిలదీత
రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు
చేసేదేంలేక వెనుదిరిగిన వైసీపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోజాను ముందుకు వెళ్లనీయలేదు. సర్దిచెప్పేందుకు చూసినా వారు వినిపించుకోకపోవడంతో చేసేదేంలేక మంత్రి రోజా వెనుదిరిగారు. ప్రచారం చేయకుండానే వచ్చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025