పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈపూరు, : పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. బుధవారం వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్ కార్యక్రమానికి ఇనుమెళ్ల గ్రామానికి చెందిన తెదేపా శ్రేణులు తమ వాహనాల్లో బయల్దేరడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే వైకాపాకు చెందిన ఒక యువకుడు ద్విచక్రవాహనంపై వచ్చి తెదేపా వారి వాహనాలను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా గొడవకు దిగడంతో తెదేపా కార్యకర్తలు చేయి చేసుకున్నారు. గ్రామపెద్దలు సర్దిచెప్పడంతో వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆంజనేయులు నామినేషన్ కార్యక్రమం ముగించుకొని తెదేపా కార్యకర్తలు సాయంత్రానికి ఊర్లోకి వచ్చారు. ఉదయం జరిగిన గొడవను మనసులో పెట్టుకొన్న వైకాపా వర్గీయులు ప్రణాళిక ప్రకారం కత్తులు, రాళ్లు, కర్రలతో వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తెదేపాకు చెందిన చింతల సీతారామాంజినేయులు, చింతల కుమారి, నాగార్జున, చలమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు ఆందోళన చేశారు.
Also read
- Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!
- లేడీస్ హాస్టల్లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..
- వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
- రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్: కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
- దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!





