తమ సమస్యలు పరిష్కరించలేదని నిలదీత
రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు
చేసేదేంలేక వెనుదిరిగిన వైసీపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోజాను ముందుకు వెళ్లనీయలేదు. సర్దిచెప్పేందుకు చూసినా వారు వినిపించుకోకపోవడంతో చేసేదేంలేక మంత్రి రోజా వెనుదిరిగారు. ప్రచారం చేయకుండానే వచ్చేశారు.
Also read
- విషాదం – బైక్పై తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లిన కుమారుడు
- మహిళ ప్రాణాలను బలిగొన్న అగరబత్తి – దోమల బాధ తట్టుకోలేక వెలిగిస్తే నిద్రలోనే మృతి
- పగలు బొమ్మలాట.. రాత్రిళ్లు చోరీలు
- ఇదేం దోపిడీ రా నాయనా…ఫోన్ పే చేస్తారు…సక్సెస్ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..! అదే ట్విస్ట్..
- శివుడు కలలోకి వచ్చి ఇలా చెప్పాడు.. ఆ భక్తుడు ఏం చేశాడో చూస్తే స్టన్



