నిడదవోలు
*భారీ వర్షాలకు నెలకొన్న సమస్యలపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ .. కదలిన యంత్రాంగం*
*మంత్రి దుర్గేష్ సత్వర ఆదేశాలతోయుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు.. తిమ్మరాజుపాలెంలో నీటి ముంపు సమస్య పరిష్కారం*
*కోటసత్తెమ్మ ఆలయం, నిడదవోలు -ఎర్నగూడెం, నిడదవోలు -కంసాలిపాలెం రహదారి వద్ద వర్షపు నీటి తొలగింపు..జేసీబీల సాయంతో పంట కాలువలో గుర్రపుడెక్క తొలగింపు పనులు పూర్తి*
*మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించిన అధికారులు*
*భక్తుల దర్శనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు*
*వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన*
నిడదవోలు:భారీ వర్షాల ధాటికి నిడదవోలు రూరల్ మండలం తిమ్మరాజుపాలెంలోని ప్రసిద్ధ శ్రీ కోటసత్తెమ్మ తల్లి ఆలయంలోకి, అలాగే నిడదవోలు -ఎర్నగూడెం, నిడదవోలు -కంసాలిపాలెం రహదారిపైకి పంట కాలువ నీరు వచ్చి చేరిందన్న సమాచారం అందగానే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తక్షణమే స్పందించారు. సమస్య తీవ్రతను గు గుర్తించి, సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయికి చేరుకున్న అధికారులు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించి నీటి ముంపు సమస్యను త్వరితగతిన పరిష్కరించారు. పంట కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్కను జేసీబీల సాయంతో వెంటనే తొలగించారు. ఆలయ ప్రాంగణంలోకి చేరిన వరద నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేయించారు. ఆలయ ప్రాంగణంలో త్వరితగతిన పారిశుధ్య పనులు పూర్తి చేసి, బ్లీచింగ్ తదితర క్రిమిసంహారకాలతో శుభ్రపరచాలని మంత్రి ఆదేశించడంతో అధికారులు చర్యలు చేపట్టారు.సహాయక చర్యలు జరుగుతున్న సమయంలోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంతరాలయ దర్శనం కల్పించాలని సూచించారు. వర్షాల వల్ల ఎర్నగూడెం-కంసాలిపాలెం రహదారిపై రాకపోకలకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.వర్షాకాలం పూర్తయ్యే వరకు ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. విజయవాడలో ఉన్నప్పటికీ మంత్రి కందుల దుర్గేష్ సమయానుకూల స్పందన, అధికారుల త్వరితగతిన చర్యలతో ఆలయంలోకి చేరిన నీరు పూర్తిగా తొలిగిపోవడంతో భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
*జారీ చేసిన వారు: పిఆర్ఓ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు*
Also read
- ఘనంగా ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు
- భారీ వర్షాలకు నెలకొన్న సమస్యలపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ .. కదలిన యంత్రాంగం
- గంగాజలంతో శివయ్యకు అభిషేకం- వందల కిలోమీటర్లు సాగే పవిత్ర కన్వర్ యాత్ర విశిష్టత తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఐ.యఫ్.టి.యు కార్యవర్గం ఏకగ్రీవం..




