*గుంటూరు పశ్చిమ నియోజకవర్గన్నీ అభివృద్ధి పథంలో నడుపుతున్న గల్లా మాధవి..*
అమరావతి:
*గుంటూరు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జొన్నలగడ్డ ఉదయభాను ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి జన్మదిన వేడుకలను స్థానిక బ్రాడీపేట లోని నిర్మల హృదయ్ లో ఉండే నిరాశ్రయుల మధ్య ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో-ఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ, పత్తిపాడు నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ దారా అంబేద్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దిరాల మ్యాని మాట్లాడుతూ గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పథంలో నడుపుతున్నరని, ఆమె ప్రజలకు చేస్తున్న సేవలు గుర్తించి తెలుగుదేశం పార్టీలో జాతీయ పాలిట్ బ్యూరో సభ్యురాలుగా తీసుకోవడం కూడా జరిగిందని తెలిపారు. సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేని విధంగా గుంటూరు పశ్చిమం నుంచి ఎన్నికైన శాసనసభ్యులు ఎవరూ ప్రజలతో ఇంతలా మమేకమవ్వలేదని, ఒక మహిళ శాసనసభ్యురాలై ఉండి కూడా తన ద్విచక్ర వాహనంపై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తక్షణమే అక్కడికక్కడే పరిష్కరిస్తూన్నారని, ఎవరైతే నియోజకవర్గంలో అవకతవకలకు పాటుపడుతున్నారో వారి పైన చట్ట రీత్యా చర్యలు తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రతో ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. దారా అంబేద్కర్ మాట్లాడుతూ ఏ వర్గాలకు ఆ వర్గాలకి విడివిడిగా సమస్యల పరిష్కార కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని, డబుల్ ఇంజన్ సర్కార్ నిధులతో నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. జొన్నలగడ్డ ఉదయభాను మాట్లాడుతూ పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న యువతకు ప్రాధాన్యతనిస్తూ అవకాశాలు కల్పించడం గల్లా మాధవికే సాధ్యమైందని, కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ఆశయాలను నెరవేర్చటం కోసం ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల హృదయలో నిరాశ్రయులుగా ఉన్న పేదలకు ఉదయం పూట అల్పాహారం మరియు పళ్ళు అందజేయడం జరిగింది. తొలుత గల్లా మాధవి జన్మదిన కేకును సిస్టర్ సమక్షంలో కట్ చేయడం జరిగింది. గల్లా మాధవి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని దైవ ప్రార్థనలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లామ్ వర్ధన్, తెలగతోటి సుదీర్, వంకదార శ్రీనివాస్,పృధ్వీరాజ్, జొన్నలగడ్డ అమృతరాజు, బోరుగడ్డ జయప్రకాశ్, కాళి తదితరులు పాల్గొన్నారు.
Also read
- సంత మార్కెట్లో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి
- ఘనంగా ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు
- భారీ వర్షాలకు నెలకొన్న సమస్యలపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ .. కదలిన యంత్రాంగం
- గంగాజలంతో శివయ్యకు అభిషేకం- వందల కిలోమీటర్లు సాగే పవిత్ర కన్వర్ యాత్ర విశిష్టత తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?




