SGSTV NEWS online
Andhra Pradesh

సంత మార్కెట్‌లో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి



👉ఐ *లవ్ యూ నిడదవోలు సెంటర్ వద్ద నిడదవోలు పట్టణ సంక్షేమ సంఘం ధర్నా*

నిడదవోలు న్యూస్ ఆగస్టు 6:

👉నిడదవోలు పట్టణంలోని ఐ లవ్ యూ నిడదవోలు – గణేష్ చౌక్ – సంత మార్కెట్ ప్రాంతంలో వెంటనే సులభ్ కాంప్లెక్స్ (పబ్లిక్ టాయిలెట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు పట్టణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఐ లవ్ యూ నిడదవోలు సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.

👉.  ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ, నిడదవోలు పట్టణానికి ప్రతిరోజూ సుమారు 40 గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు, వృద్ధులు, వ్యాపారులు మరియు ప్రయాణికులు పట్టణంలో పబ్లిక్ టాయిలెట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

👉.  పట్టణంలో ప్రస్తుతం బస్టాండ్‌లో ఉన్న ఒక్క పబ్లిక్ టాయిలెట్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండగా, గణేష్ చౌక్, సంత మార్కెట్, ఐ లవ్ యూ నిడదవోలు సెంటర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

👉. గతంలో ఈ సమస్యను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కనిపించలేదని ఆరోపించారు.

👉.. ధర్నాలో పాల్గొన్న సభ్యులు ” *సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి* “, “ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

👉..ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంత మార్కెట్, గణేష్ చౌక్, ఐ లవ్ యూ నిడదవోలు సెంటర్ ప్రాంతాల్లో శాశ్వత సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను కోరారు.

జువ్వల రాంబాబు పట్టణ ప్రజలసంక్షేమ సంఘం అధ్యక్షులు. కారింకి వెంకటేశ్వర రావు తాపీ పనివారలసంఘం అధ్యక్షులు నాయకత్వం వహించారు

Also read

Related posts