సత్తెనపల్లి : టిడిపి అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారన్నారు. చంద్రబాబును తిట్టిన వాళ్లంతా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారన్నారు. నేను పండక్కి డ్యాన్స్ చేస్తే విమర్శిస్తున్నారు.. కానీ చంద్రబాబు, ఆయన పక్కన ఉండే పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్యాన్స్‌ర్లని సెటైర్ వేశారు. పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ వేస్తే.. చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను చంద్రబాబును రాజకీయంగా మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు. చంద్రబాబు సభకు జనమే రాలేదని అన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025