వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం జరిగింది. మరో మెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ కాలేజీలో చదువుతోంది.
వెస్ట్ బెంగాల్(west bengal) లో మరో దారుణం జరిగింది. మరో మెడికల్ స్టూడెంట్(medical-student) అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ కాలేజీలో చదువుతోంది. అయితే నిన్న తన మిత్రుడితో కలిసి రాత్రి 8 గంటలకు తినేందుకు బయటకు వెళ్తుండగా.. క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి రేప్ చేశాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.
బాధితురాలి ఫోన్ కూడా
రెండవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం… ఆమె ఒక స్నేహితుడి కోరిక మేరకు ఆహారం కోసం క్యాంపస్ బయటకు వెళ్లింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆమె స్నేహితుడు అక్కడి నుంచి పారిపోగా, గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఆమెను సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి ఫోన్ కూడా లాక్కెళ్లారు.
ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలి తల్లి చెబుతుంది. ఆమెతో వెళ్లిన అబ్బాయి ఆమెను తిరిగి తీసుకువచ్చాడని తెలిపింది. కాగా 2024లో వెస్ట్ బెంగాల్ లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన RG కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also read
- పెళ్లి అయినా తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
- Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఇన్స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల…లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు
- వస్తున్నాయ్ ఫీలింగ్స్!
- నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?





