శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో శనివారం గ్రామ వైకాపా నాయకుడు మారు సుధాకర్రెడ్డి కారులో ఏడు బస్తాల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముత్తుకూరు, : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో శనివారం గ్రామ వైకాపా నాయకుడు మారు సుధాకర్ రెడ్డి కారులో ఏడు బస్తాల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4,240 మద్యం సీసాలను అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. వారు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం మేరకు 20 బస్తాల్లో ఉన్న మద్యాన్ని మూడు కార్లలో తరలించేందుకు నాయకులు ప్రయత్నించారు. అధికారులు కార్లను వెంబడించారు. సుధాకర్రెడ్డికి చెందిన కారులో ఏడు బస్తాల్లో మద్యాన్ని గుర్తించారు. మిగిలిన 13 బస్తాల మద్యం సదరు నాయకుడి బంధువులకు చెందిన రొయ చెరువుల వద్ద డంప్ చేసినట్లు తెలుసుకుని స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లను సీజ్ చేశారు.
సుధాకర్ రెడ్డితోపాటు డ్రైవర్ వెంకటరమణ, రాము, నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025