July 3, 2024
SGSTV NEWS
HealthLifestyle

రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి.. అందుకే, ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని.. జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు.

రాత్రి పడుకునే ముందు ఈ చిన్న అలవాటు అలవర్చుకుంటే.. మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది.. దీంతో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. రాత్రి మంచి నిద్ర కోసం పడుకునే ముందు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో.. ఇప్పుడు తెలుసుకోండి..

రాత్రి నడక వల్ల కలిగే ప్రయోజనాలు..
నిద్రను మెరుగుపరుస్తుంది: నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను కొద్దిగా తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు అవసరం.. దీనివల్ల మనసుకు ప్రశాంతతతోపాటు తేలికగా నిద్ర పడుతుంది.

మానసిక ఆరోగ్యం: సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది: రోజూ నిద్రపోయే ముందు నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం: రెగ్యులర్ ఈవెనింగ్ వాక్ గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

కండరాలకు బలం చేకూర్చుతుంది: నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది.

రాత్రి వేళ వాక్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత నడకకు వెళ్లండి.
అతి వేగంగా నడవకండి, తేలికపాటి వేగంతో మాత్రమే నడవండి.
సౌకర్యవంతమైన దుస్తులు, బూట్లు ధరించండి.
మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, నడకకు వెళ్లే ముందు వైద్యుడిని సంప్రదించండి.
ఈ రోజు నుంచే ప్రారంభించండి..
ఈవెనింగ్ వాకింగ్ అనేది ఏ వయసు వారైనా చేయగలిగే సులభమైన వ్యాయామం. దీనికి ప్రత్యేక తయారీ లేదా పరికరాలు అవసరం లేదు. కాబట్టి మీరు దేని కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. ఈ రోజు నుంచే రాత్రి పడుకునే ముందు నడకను అలవాటు చేసుకోండి.. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మంచి నిద్రను పొందండి.

Also read

Related posts

Share via