కూటమి సీట్ల మధ్య కొనసాగుతున్న సర్దుబాట్లు
అనపర్తి టీడీపీకి, తంబళ్లపల్లె బీజేపీకి
నిన్న రెండు గంటల పాటు మంతనాలు జరిపిన కూటమి నేతలు
ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి బదులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది.
నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల సేపు భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల మార్పు విషయంపై చర్చించారు.
మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు టికెట్ విషయంపై కూడా వీరు చర్చించారు. నరసాపురం లోక్ సభ స్థానాన్ని టీడీపీకి వదిలేయాలని, అక్కడ రఘురాజును నిలబెడతామని చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని, అక్కడి నుంచి నరసాపురం లోక్ సభ అభ్యర్థి శ్రీనివాసవర్మను పోటీ చేయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెప్పారు.
Also read
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!
- Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
- అన్నా.. అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో
- అడిగితే కొడుతున్నారు.. భార్య కోసం టవర్ ఎక్కిన యువకుడు.. చివరకు ట్విస్ట్ మామూలుగా లేదుగా..





