February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!

కీసర(హైదరాబాదు): ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు  పాల్పడిన సంఘటన ఆదివారం కీసర పోలీస్ స్టేషన్ (Keesara Police Station) పరిధిలోని కీసర దాయరలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కీసర దాయరకు చెందిన ప్రవళిక(23) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా (Software Engineer) పని చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె తల్లిదండ్రులతో పాటు, సోదరుడు బయటికి వెళ్లారు.

సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ప్రవళిక (Pravallika) ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

Also read

Related posts

Share via