కీసర(హైదరాబాదు): ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కీసర పోలీస్ స్టేషన్ (Keesara Police Station) పరిధిలోని కీసర దాయరలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కీసర దాయరకు చెందిన ప్రవళిక(23) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా (Software Engineer) పని చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె తల్లిదండ్రులతో పాటు, సోదరుడు బయటికి వెళ్లారు.
సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ప్రవళిక (Pravallika) ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





