పెద్దపల్లి జిల్లా టీచర్స్ కాలనీలో విషాద ఘటన జరిగింది. మూడేళ్ల పాపను కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపి ఆ తర్వాత సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల పాప వితన్య రెడ్డిని కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపింది. అనంతరం సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. అయితే భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. సాహితీ భర్త LICలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడి కోసం భర్తను..
ఇదిలా ఉండగా ఇటీవల పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది
ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా వాడారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు
ఇటీవల పొలం పనుల కోసమని వెళ్లిన రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో మనీష్ అనుమానంతో వెళ్లి చూడగా అక్కడ రూబీ, సునీల్‌లు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. దీంతో అక్కడే రూబీ,మనీష్ ల మధ్య గొడవ మొదలైంది. దీంతో తన వెంట తెచ్చుకున్న పిస్టల్‌తో సునీల్.. మనీష్ ను కాల్చి చంపేశాడు.
Also Read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





